తెలుగు సినిమాలలో వెన్నెల కిశోర్ లేని సినిమా లేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్ని తెలుగు సినిమాలలోనూ ఇప్పుడు కిషోర్ వుంది తీరాల్సిందే, పెద్ద పెద్ద నటులు సైతం వెన్నెల కిషోర్ డేట్స్ కోసం తమ షూటింగ్స్ ని కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు చాలా వున్నాయి. అలంటి వెన్నెల కిషోర్ ఇప్పుడు కథానాయకుడిగా ఒక సినిమా రాబోతోంది. దాని పేరే ‘చారి 111’ . ఇదేదో ‘జేమ్స్ బాండ్ 777’ ‘గూఢచారి 116’ లాంటి టైటిల్ లా వుంది కదా, సినిమా కూడా అంతేనట మరి.
ఈ సినిమాకి దర్శకుడు టీజీ కీర్తి కుమార్. ఇతను ఇంతకు ముందు, సుమంత్ కథానాయకుడిగా నటించిన ‘మళ్ళీ మొదలైంది’ సినిమాకి దర్శకత్వం చేసాడు. ఇప్పుడు ఈ ‘చారి 111’ సినిమా చేస్తున్నాడు. ఇది ఒక వినోదం మిళితమైన యాక్షన్ సినిమా అని, ఇందులో ‘వెన్నెల’ కిశోర్ ఒక గూఢచారి పాత్ర పోషిస్తున్నాడు అని ప్రకటించారు. కిశోరె సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ శర్మ ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
“ఇదొక యాక్షన్ కామెడీ సినిమా. ఇందులో’ కిశోర్ గూఢచారి (స్పై) పాత్రలో కనిపిస్తారు. ఓ సిటీలో జరిగే అనుమానాస్పదన ఘటనలను ‘వెన్నెల చేధించే రహశ్యం గూఢచారి పాత్రలో అయన లుక్ స్టైలిష్ గా ఉంటుంది. అలాగే “ఆ పాత్రలో ఓ గందరగోళం కుడి ఉంటుంది అది ఏమిటి ? గూఢచారి ఏం చేశాడు? అనేది సినిమా చూడాలి అని చెప్పాడు. దర్శకుడు టీజీ కీర్తి కుమార్ గూఢచారి సంస్థ హెడగా కథలో కీలక పాత్రలో మురళి శర్మ కనిపిస్తారు స్టాలీష్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా అంత వినోదభరితంగా ప్రేక్షకుడిని సినిమా అలరిస్తుంది అని దర్శకుడు చెప్పాడు. ఈ చిత్రానికి నిర్మాత అదితి సోనీ.