అమెజాన్ ప్రైమ్ లో మహావీరుడు ఎప్పుడంటే!

Sivakarthikeyan.
Sivakarthikeyan.

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరుగా శివకార్తికేయన్ కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలో శివ కార్తికేయన్ తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. అలా ఆయన ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆయన తమిళంలో చేసిన ‘మహావీరన్’ రిలీజ్ కాగా .. తెలుగులో ‘మహావీరుడు’అనే పేరుతో జులై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అదితి శంకర్ కథానాయికగా కనిపించింది. అలాంటి ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 11వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఈ సినిమాలో హీరో ఓ బస్తీ యువకుడు.అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేదే కథ. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో కూడిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.