‘జనక అయితే గనక’ వచ్చేది ఎప్పుడో తెలుసా …!

When 'Janaka but Ganaka' will come...!
When 'Janaka but Ganaka' will come...!

నటుడు సుహాస్ ప్రస్తుతం హీరోగా పలు మూవీ ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు . ఆయన నటిస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘జనక అయితే గనక’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ మూవీ నుంచి నేడు ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే, ఇవాళ సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని కూడా వారు లాక్ చేశారు.

ఈ మూవీ ని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. అయితే, ఆ రోజున మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా, అది వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సుహాస్ సినిమా అదే రోజు రిలీజ్ అవుతుండటంతో ఈ వార్తలు నిజమేనని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ మూవీ లో సంగీర్తన హీరోయిన్‌గా నటించగా సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ మూవీ లో రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.