‘తండేల్’ నెక్స్ట్ సాంగ్ ప్రోమో వచ్చేది ఎప్పుడో తెలుసా ..!

Do you know when the promo for the next song of 'Tandel' will be released?!
Do you know when the promo for the next song of 'Tandel' will be released?!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘తండేల్’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ మూవీ ని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘బుజ్జి తల్లి’ సాంగ్‌కి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

Do you know when the promo for the next song of 'Tandel' will be released?!
Do you know when the promo for the next song of ‘Tandel’ will be released?!

అయితే, ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో సింగిల్ సాంగ్‌గా ‘నమో నమ: శివాయ’ అనే పాటని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటని జనవరి 4న సాయంత్రం 5.04 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సాంగ్ ప్రోమోని జనవరి 3న ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు.

ఇక ఈ మూవీ లో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.