తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది..?

తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటోంది. పవర్ గేమ్‌లో రెండు పార్టీల డైలాగ్ వార్ హాట్‌ టాపిక్‌గా మారింది. రంగారెడ్డి జిల్లా నేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశమైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల, రాజేంద్రనగర్‌లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.