కత్తికి చుక్కలు చూపిన వివేక్‌ ఎవరో తెలుసా?

Who is Director Vivek Who Opposed Kathi Mahesh
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ ఫ్యాన్స్‌ను ఉగ్రవాదు, మానసిక రోకం కలిగిన వారు అంటూ పదే పదే విమర్శిస్తూ వస్తున్న కత్తి మహేష్‌కు ఇటీవల ఒక ఛానెల్‌ ఇంటర్వ్యూలో వివేక్‌ అనే దర్శకుడు సరైన కౌంటర్‌ వేసి, నోరు మూయించిన విషయం తెల్సిందే. కత్తి మహేష్‌ను తన తల్లి గురించి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా వివేక్‌ కోరడంతో ఆయన లైవ్‌ నుండి వెళ్లి పోయాడు. కత్తి మహేష్‌ను మొదటి సారి నోరు మూయించిన వ్యక్తిగా వివేక్‌ గుర్తింపు దక్కించుకున్నాడు. దర్శకుడు వివేక్‌ ఉన్నట్లుండి ఒక్కసారిగా పవన్‌ ఫ్యాన్స్‌కు ఆప్తుడు అయ్యాడు. ఇప్పటి వరకు ఇండస్ట్రీ వారు కూడా సరిగా వివేక్‌ గురించి వినలేదట. అసు ఈ వివేక్‌ ఎవరు? దర్శకుడిగా ఏ సినిమాలకు చేశాడు అనే విషయంపై పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు అందరిలో చర్చ జరుగుతుంది.

సినిమాలపై అభిమానంతో రచయితగా కెరీర్‌ను ప్రారంభించిన వివేక్‌ పలు సినిమాలకు, షార్ట్‌ ఫిల్మ్‌లకు, సీరియల్స్‌కు స్క్రిప్ట్‌ వర్క్‌లో సహాయం చేశాడట. ఆ మద్య ఒక సినిమాను కూడా తెరకెక్కించాడట, కాని ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా వివేక్‌ ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా కూడా చేస్తున్నాడు. వర్మ దర్శకత్వంలో రూపొందిన వంగవీటితో పాటు పలు తెలుగు సినిమాలకు వివేక్‌ సహాయ దర్శకత్వం చేశాడని, వర్మ వద్ద మంచి సన్నిహిత్యం ఉన్న వ్యక్తి అంటూ సమాచారం అందుతుంది. వర్మకు పవన్‌ కళ్యాణ్‌ అంటే పెద్దగా పడదు. కాని వర్మ శిష్యుడు అయిన వివేక్‌ తాజాగా కత్తి మహేష్‌తో పవన్‌కు అనుకూలంగా యుద్దం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వివేక్‌ను ప్రస్తుతం పవన్‌ ఫ్యాన్స్‌ నెత్తిన ఎత్తుకుంటున్నారు. మరోసారి వివేక్‌ మీడియా ముందుకు వచ్చి కత్తిని చిత్తు చేయాలని అంతా కోరుకుంటున్నారు.