రసవత్తరంగా రాష్ట్రపతి రేస్

who is next president of india

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Next President Of India

దేశ రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ముందు వినిపించిన పేరు లాల్ కృష్ణ అద్వానీ. అయితే విజయవంతంగా బాబ్రీ కేసు బయటకు తీసిన మోడీ. గురువుకు పంగనామాలు పెట్టారు. తర్వాత ఎవరికీ తెలియని వ్యక్తులైన ద్రౌపది ముర్ము, థావర్ చెంద్ గెహ్లాట్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వారికి సొంత పార్టీ నేతలే ఓటేయరేమోనన్న భయం మోడీని వెంటాడుతోంది. అందుకే అద్వానీకి ఇవ్వలేకపోయిన పదవిని. ఆయన శిష్యులకే కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్ ను మొదట్నుంచీ దూరం పెడుతున్న మోడీ. ఆమెను రాష్ట్రపతి భవన్ పంపిస్తే ఓ పనైపోతుందనుకుంటున్నారట. పైగా ఆమెకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉండటంతో. సుష్మాకు అందరూ మద్దతిస్తారని భావిస్తున్నారు. కానీ సుష్మా పూర్తిగా తన మాట వినకపోవచ్చని, ఆమెకు స్వతంత్ర భావాలు ఎక్కువని మరో ఆలోచన ఉంది.

ఒకవేళ సుష్మాతో కష్టమనుకుంటే కేంద్రమంత్రి వెంకయ్య పేరు కూడా పరిశీలిస్తారనే వాదన ఉంది. కానీ ఇప్పటిదాకా మోడీకి డబ్బా కొట్టిన వెంకయ్యను రాష్ట్రపతిగా అందరూ జీర్ణించుకోవడం కష్టం. విపక్షాలు కూడా ఆయనకు మద్దతివ్వకపోవచ్చు. అటు వామపక్షాలపై పార్లమెంటులో విరుచుకుపడ్డ ఆయనపై వారికీ కోపముంది. అయినా సరే వెంకయ్య వ్యక్తిగతంగా అందరికీ ఇష్టుడే. ఆ కోణంలో ఓట్లు పడతాయని యోచిస్తున్నారట.

విద్యుత్ సరే.. నిధుల మాటేంటి కేటీఆర్..?

త్రిసభ్య కమిటీతో బాబు చెక్ పెడతారా..?