కేకేతో కేసీఆర్ కు పనైపోయిందా..?

trs leader ds and kk involved in miyapur land scam

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏరికోరి పార్టీలో చేర్చుకున్న నేతలే… ఇప్పుడు కేసీఆర్ కు చేదయ్యారు. కాంగ్రెస్ కు ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ లు గా పనిచేసిన స్థాయి ఉన్న నేతలను రిటైర్మెంట్ ఏజ్ లో బద్నాం చేయాలని గులాబీ బాస్ కంకణం కట్టుకున్నారు. అందుకే మియాపూర్ భూకుంభకోణంలో మొదట కేకే పేరు. తర్వాత డీఎస్ పేరు వ్యూహాత్మకంగా బయటకు తీసింది. టీఆర్ఎస్ చిన్నస్థాయి లీడర్ ను వేలెత్తిచూపినా విరుచుకుపడే టీఆర్ఎస్ వర్గాలు.. ఇప్పుడు వీరిద్దరి విషయంలో మాత్రం మౌనం పాటించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

కనీసం కేకే, డీఎస్ అమాయకులని, వారు తెలిసి అలాంటి భూములు కొనుగోలు చేయలేదనే మాట అటు కేసీఆర్ కానీ, ఇటు మంత్రులు కానీ చెప్పడం లేదు. అంటే వీరిద్దర్నీ పొమ్మనకుండా పొగ పెట్టేసినట్లేననే మాట వినిపిస్తోంది. అదే నిజమైతే దశాబ్దాలుగా తమను ప్రోత్సహించిన కాంగ్రెస్ ను వదిలి కారెక్కినందుకు… వీరిద్దరు తమ చెప్పులతో తామే కొట్టుకోవాలి.
కుక్కను చంపాలంటే ముందు దాన్ని పిచ్చిదని ముద్రేయాలి. ఇదో ముతక సామెత. కానీ కేసీఆర్ పాలిటిక్స్ మాత్రం ఇదే కోణంలో సాగుతుంటాయి. కాంగ్రెస్ మోసం చేసిందని, టీడీపీ ద్రోహం చేసిందని కల్లబొల్లి కబుర్లు చెప్పడం అలవాటైన కేసీఆర్… ఇప్పుడు సీనియర్లతో తలనొప్పి ఎందుకని ఇద్దర్నీ బయటకు పంపడానికి ప్లాన్ చేసినట్లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మరి సీనియర్లు ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది.