తెలుగు సినీ పరిశ్రమలోని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంటర్ అయ్యి మంచి నటుడిగా నిలబడిన నటుల్లో అడివి శేష్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, దర్శకుడిగా అడివి శేష్ రాణిస్తున్నారు. కేవలం హీరో పాత్రలే కాకుండా సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ రోల్స్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2016లో వచ్చిన ‘క్షణం’, కిందటేడాది విడుదలైన ‘గూఢచారి’ సినిమాలు అడివి శేష్‌కు మంచి ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. మహేష్ బాబు నిర్మాతగా అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమాను ప్రకటించడంతో ఆయన స్థాయి మరింత పెరిగిపోయింది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ‘గూఢచారి’ తరవాత అడివి శేష్ హీరోగా ‘మేజర్’ సినిమా మాత్రమే వస్తుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా ‘ఎవరు’ అనే సినిమాను ప్రకటించి శేష్ అందరికీ షాక్ ఇచ్చారు. ప్రకటించడమే కాక ఈ ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పేశారు. ఇంతకాలం ఈ సినిమా గురించి చెప్పకుండా రహస్యంగా షూట్ చేసేశారట. సినిమాలోని ట్విస్ట్‌లు బయటికి తెలియకుండా ఉండటానికి సినిమాను రహస్యంగా చిత్రీకరించినట్లు అడివి శేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఎవరు’ టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా బ్యానర్‌పై పెర్ల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కావిన్ అన్నె నిర్మిస్తున్నారు. వెంకట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెజీనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.