ధర్మపురి బరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో..?

Whose flag will be hoisted in Dubbaka this time..?
Whose flag will be hoisted in Dubbaka this time..?

ధర్మపురి లో తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్న నియోజకవర్గాలలో ధర్మపురి ఒకటి. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ 2004 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చారనే చెప్పవచ్చు. ఈసారి కచ్చితంగా ధర్మపురిని గెలిచి తీరాలి అని కొప్పుల ఈశ్వర్ పట్టుదలతో ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ గతంలో 300 కోట్ల తేడాతో ఓడిపోయిన ఈసారి కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలి అని అనుకుంటున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన కారణమొకటి, గతంలో ఓటమి వలన ఏర్పడిన సానుభూతి ఇవి రెండు తనను గెలిపిస్తాయని లక్ష్మణ్ కుమార్ ధీమాతో ఉన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే నేనేమైనా తక్కువ ఈసారైనా ధర్మపురిలో బిజెపి ఉందని నిరూపిస్తాను, అంటూ బిజెపి తన అభ్యర్థిగా వివేక్ ని బరిలో దించే ఛాన్స్ ఉంది.

వివేక్ కూడా నియోజకవర్గము గురించి ఆరాలు తీస్తున్నారని తెలుస్తోంది. ఈసారి బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ఇవి మూడు ధర్మపురిలో పోటీ చేస్తే ఎన్నికల్లో పోరు రసవత్తరంగా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అయితే వివేక్ పోటీలో ఉంటేనే ధర్మపురిలో బి‌జే‌పి రేసులో ఉంటుంది. లేదంటే బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఈసారి ధర్మపురి లో ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతోనే గెలుస్తారు అని రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నారు.