ఆర్టికల్ 370 రద్దు వల్ల మనవాళ్ళు ఎందుకు ఆనంద పడుతున్నారు ?

why-do-our-children-rejoice-in-the-abolition-of-article-370

నిజంగా కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనగానే అఖండ భారత్ సాధ్యమైందని ఆనంద పడుతున్నాం కదా. అసలు అఖండ భారత్ అంటే తెలుసా??? ప్రాచీన కాలంలో గాంధార(ఆహ్ఘనిస్తాన్) కాంబోజ(కంబోడియా) ఇవన్నీ అఖండ భారతంలో భాగాలే పోనీ అవన్నీ ప్రాచీన కాలంనాటివి అనుకుందాం,

ఇప్పటి లెక్కలు తీసుకొన్నా సుమారు 3.5 లక్షల చదరపు కిలోమీటర్లు వైశాల్యం గల కాశ్మీర్ లో …గిల్జిత్, బలుచిస్తాన్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్) 72,971 చదరపు కిలోమీటర్లు, ఆజాద్ కాశ్మీర్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్) 13,297 చదరపు కిలోమీటర్లు, ఆక్సాయ్ చిన్(చైనా ఆక్రమిత కాశ్మీర్) 37,244 చదరపు కిలోమీటర్లు పోను మనకు మిగిలిన 2,22,236 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఇప్పటి 370 ఆర్టికల్ రద్దు కిందకి వస్తుంది.

కనీసం ఆజాద్ కాశ్మీర్ మనలో కలిసినప్పుడు మాత్రమే మనం అనుకునే అఖండ భారత్ సాధ్యం. ఏది ఏమైనా 370 రద్దు అనేది కాశ్మీరీల అభివృద్ధి కోసమే అని పాలకుల మాట ఎంత నిజమో తెలియదు కానీ మెజారిటీ భారతీయులకు ఆనందాన్ని ఇచ్చింది. దానివలన ఏమాత్రం ఉపయోగం లేనివారు, అవగాహన లేనివారు సైతం ఆనందించడం చూస్తుంటే చాలా బాగుంది కానీ కాశ్మీరీల అభివృద్ధి ఎలా ఉన్నా శాంతి చేకూరితే చాలు. భూతల స్వర్గం అనే పేరు నిలబడితే అదీ నిజమైన అఖండ భారతం