నాగై జిల్లా వేదారణ్యం సమీపం కడయన్ కాడు ప్రాంతానికి చెందిన దేవేంద్రన్. కీలయూర్ యూనియన్ డీఎంకే కౌన్సిలర్ అయిన ఈయన పచ్చకామర్లు, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీ తిరిగి అతనికి అస్వస్థత ఏర్పడడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. 6 తేదీన మృతి చెందాడు.
దేవేంద్రన్ మృతి తరువాత అతని భార్య సూర్య ఎవరితోనో ఫోన్లో తరచూ మాట్లాడుతుండడంతో సందేహించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా దేవేంద్రన్ భార్య సూర్యాకు అదే ప్రాంతానికి చెందిన ఇంజినీరు చంద్రశేఖర్ కు వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న దేవేంద్రన్‌కు సాంబార్లో విషం కలిపి తినిపించి హత్య చేసినట్లు తెలిసింది. పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసి సూర్య, చంద్రశేఖర్‌ను ఆదివారం అరెస్టు చేశారు.