నెల్లూరు జిల్లాలో భర్త కళ్లేదుటే.. భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లోనూ అదే తరహా ఘటన జరిగింది. వివరాలు.. రాజేంద్ర నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎం. పహాడీలో ఈ దారుణం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటు పడిన భర్త సాజీద్ వేధింపులు తాళలేక భార్య షబానా బేగం అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాగా, ఆ వివాహిత.. భర్త కళ్లేదుటే.. తాను విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నీవు ఇక నుంచి ప్రశాంతంగా ఉండు.. అంటూ భర్తతో చెప్పి పురుగుల మందు సేవించింది. అయితే, భార్యను కాపాడాల్సింది పోయి… సాజీద్ పైశాచికంగా ప్రవర్తించాడు. తన ముందే భార్య విషం తాగి గిల గిలా కొట్టుకుంటున్నా.. ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో పాపం.. ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. షబానా మృతితో ఆమె ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.