జైలు నుండి విడుదలైన భర్తను చూడటానికి క్వారంటైన్‌లో ఉన్న భార్య పరారైన ఘటన ఘటన బెళగావి జిల్లాలో జరిగింది. బెళగావి జిల్లా గోకాక్ తాలూకా పంజానట్టికి చెందిన మహిళను మహారాష్ట్ర కోల్లాపుర జిల్లా గడహింగ్లజ్ నూల్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఇటీవల పుట్టినిల్లు పంజానట్టికి వచ్చారు. దీంతో అధికారులు తక్షణం మహిళతో పాటు ఆమె జతలోని బిడ్డను క్వారంటైన్‌కు తరలించారు. ఒక నేరం కేసులో పోలీసులు భర్తను జైలుకు పంపారు.
పెరోల్‌పై భర్తను విడుదల చేశారు. విషయం తెలుసుకున్న మహిళ ఎవరికీ తెలియకుండా క్వారంటైన్ నుండి పరారయ్యారు. ఆమె ఎక్కడికెళ్లిందో పోలీసులకు అంతుపట్టలేదు. దీంతో గాలింపు చేపట్టారు. దంపతులిద్దరు హుక్కేరి తాలూకా బెల్లద బాగేవాడి గ్రామంలో బంధువుల ఇంటిలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు పట్టుకోని పంజానట్టికి తీసుకు వచ్చారు. వీరిని తమ గ్రామానికి తీసుకురావద్దంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో గోకాక్ పట్టణంలోని బీసీఎం హాస్టల్ క్వారంటైన్‌కు తరలించారు.