వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య, తన కొడుకు, ప్రియునితో కలిసి భర్తను కాటికి పంపింది. ఈ దారుణం బెళగావి జిల్లా చించోళి వద్ద వెలుగుచూసింది. హతుడు కుమార రాముఖోత (39). అతని భార్య గీతకు బాలేశ అనే వ్యక్తితో సంబంధం ఉండేది. ఇది మానుకోవాలని అనేకసార్లు భర్త హెచ్చరించినా పెడచెవిన పెట్టింది.
చివరకు ప్రియుడు, కొడుకు సచిన్, మరో ఇద్దరితో కలిసి పథకం ప్రకారం గత నెల 27న భర్తకు మద్యం తాగించి బండరాయితో కొట్టిచంపి శవాన్ని ప్లాస్టిక్కవర్లో చుట్టి సమీపంలో కృష్ణా నదిలో పడేశారు. భర్తను ఎవరో దుండగులు చంపేశారని ఏడవసాగింది. కుడచి పోలీసుల విచారణలో బండారం బట్టబయలైంది. మంగళవారం మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.