భర్తను రోకలి బండతో కొట్టి బావిలో తోసి హత్య చేసిన భార్యను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా పరవకోటై స్వామినాథన్ వీధికి చెందిన పాండ్యన్ (45), మహేశ్వరి (40) దంపతులు. పాండ్యన్ రోజూ మద్యం తాగి భార్యను చిత్రహింసలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రెండు రోజులుగా పాండ్యన్ ఇంటికి రాకపోవడంతో బంధువులు అతని కోసం గాలించారు.
ఇంటి సమీపంలోని బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బావిలో చూడగా పాండియన్ శవంగా కనిపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. మహేశ్వరి భర్తను రోకలితో దాడి చేసి బావిలోకి తోసినట్టు తెలిసింది.