కట్టుకున్న భార్యే అంతం చేసింది

కట్టుకున్న భార్యే అంతం చేసింది

మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌ అచ్చేభా తనయుడిపై హత్యాయత్నం జరిగింది. కట్టుకున్న భార్యే అతన్ని అంతమొదించేందుకు యత్నించింది. తన చెల్లెలిని రెండో వివాహం చేసుకోవటంతోపాటు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే ఆవేదనతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన అతడ్ని హుటాహుటిన విజయవాడకు తరలించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌ అచ్చేభాకు ఇద్దరు కుమారులు, మొదటి కుమారుడు కొంతకాలం కిందట గుండెపోటుతో మరణించాడు.

నగరంలో బంగారు దుకాణం నడుపుతున్న అచ్చేభా రెండో కుమారుడు ఎస్‌కే ఖాదర్‌బాషా నూరుద్దీన్‌పేటకు చెందిన నజియాను పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప, ముగ్గురు మగ పిల్లలున్నారు. కొన్ని నెలలుగా నజియా (భార్య) సోదరితో ప్రేమ వ్యవహారం నడుపుతుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని బంధువులు చెబుతున్నారు. పద్ధతి మార్చుకోవాలని నజియా పలుమార్లు అభ్యర్థించినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడు నెలల కిందట తన సోదరి మహిబాను తీసుకువెళ్లి రెండో వివాహం చేసుకుని ఆమెను పుట్టింటిలో దించాడు. అప్పటి నుంచి ఖాదర్‌ బాషా–నజియాల మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఖాదర్‌బాషా ఎక్కువగా తన సోదరి మహిబా వద్ద ఉండడం, తనను నిర్లక్ష్యం చేయడంతో నజియా తీవ్ర మనోవేదనకు గురయ్యేది.