భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

మధ్యప్రదేశ్ అనుప్పూర్ జిల్లా కోరండి గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భోపాల్లో భార్య తన భర్తను చంపి కిచెన్‌లో పూడ్చి పెట్టేసి అనుమానం రాకుండా శవాన్ని పూడ్చి పెట్టిన స్థలంలోనే వంట చేసింది. మహేశ్ భన్వాల్, ప్రమీల దంపతులు అక్టోబర్ 21న కుటుంబ కలహాల కారణంగా మహేశ్‌ను ప్రమీల హత్యచేసి తర్వాత ఇంటిలో కిచెన్లో పూడ్చిపెట్టింది. పూడ్చిపెట్టిన దానిపై కాంక్రీట్‌తో తయారు చేసిన స్లాబ్‌ను ఏర్పాటు చేసి ఎవరికీ అనుమానం రాకుండా స్లాబ్‌పైనే ప్రమీల వంట చేసేది.

తనకేమీ తెలియనట్లు తన భర్త మహేశ్ అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆచూకీ కోసం మహేశ్ బంధువులు ఇంటికి వస్తే అదృశ్యానికి మీరే కారణమని వారిని తిట్టేది. ప్రమీల నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల ఇంకా ప్రమీల ప్రవర్తనపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మృతదేహాన్ని కిచెన్‌లోనే పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధమే మహేశ్ హత్యకు కారణమని తెలుస్తుంది.