హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో దారుణ ఘటన ఒకటి జరగింది. కుటుంబ తగాదాలతో విసిగివేసారిన భార్య భర్తను చంపేసింది. నోట్లో ‘హిట్’ కొట్టి మరీ ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మాచర్లకి చెందిన జగన్, దేవిక భార్యభర్తలు. వీరిద్దరికీ 9 ఏళ్ల క్రితం వివాహం జరగింది. ప్రస్తుతం వీరు ఫిలింనగర్లోని సైదప్పబస్తీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయినప్పటి నుంచి భార్యభర్తలకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో నిన్న రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగింది. దేవికను గాజుపెంకులతో జగన్ గాయపరచడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్త నోట్లో పురుగుల మందు (హిట్) కొట్టేయడంతో అతను మరణించాడు.
తెల్లవారుజామున ఇంటిముందు గేటు శబ్ధం రావడంతో ఇంట్లోకి దొంగలు వచ్చారన్న అనుమానంతో ఇంటి యజమానులు పై అంతస్తుకు వెళ్లి చూడగా అప్పటికే జగన్ చనిపోయి ఉన్నాడని, ఆ సమయంలో అక్కడే మరో వ్యక్తి కూడా ఉన్నాడని ఎలా చనిపోయాడని భార్య దేవికని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పిందని, దీంతో అనుమానం వచ్చి ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోయాడని వారు చెబుతున్నారు. జగన్ చాలా మంచి వ్యక్తి అని, మరో వ్యక్తితో కలిసి భార్యనే హత్య చేసి ఉంటుందని వారు చెప్పారు. వెంటనే పోలీసులకు విషయం చేరవేశామని వారు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఎవరయి ఉంటారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బహుసా అతను ఆమె ప్రియుడు అయి ఉండొచ్చని సమయం కాని సమయంలో అక్కడ ఉండటం వల్ల అనుమానిస్తున్నారు.