పారితోషికం లేకుండానే నటించేశాడు

Nithin without remuneration for srinivasa kalyanam

టాలీవుడ్‌లో యువ హీరోలు దిల్‌రాజు బ్యానర్‌లో నటించేందుకు క్యూు కడతారు. ఈయన నిర్మాణంలో వచ్చే చిత్రాలు మినిమం గ్యారెంటీ చిత్రాలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈయన నిర్మాణంలో సినిమా చేస్తే కెరీర్‌లో అదో నిలిచి పోయే చిత్రం అవుతుందని యువ హీరోలు భావిస్తారు. అందుకే తాజాగా నితిన్‌ కూడా దిల్‌రాజు బ్యానర్‌లో పట్టుబటి మరీ శ్రీనివాస కళ్యాణం చేయడం జరిగింది. దిల్‌రాజు బ్యానర్‌లో చాలా సంవత్సరాల క్రితం దిల్‌ చిత్రంలో నితిన్‌ నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంతో నితిన్‌ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాను అనే నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రంపై నమ్మకంతో నితిన్‌ పారితోషికం కూడా లేకుండానే నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 srinivasa kalyanam

నితిన్‌ ఈ చిత్రానికి ముందు ‘ఛల్‌ మోహన రంగ’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. ఛల్‌ మోహన రంగ చిత్రాన్ని నైజాం ఏరియాకు గాను దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ కొనుగోలు చేశాడు. సినిమా ఫ్లాప్‌తో దిల్‌రాజు దాదాపుగా అయిదు కోట్ల నష్టం చవిచూసినట్లుగా తెలుస్తోంది. ఆ నష్టంను భర్తీ చేసేందుకు నితిన్‌ శ్రీనివాస కళ్యాణం చిత్రానికి పారితోషికం తీసుకోలేదు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. బిజినెస్‌ మైండెడ్‌ అయిన దిల్‌రాజు ఇదే అదునుగా నితిన్‌ వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకోవాలనుకున్నాడు. చాలా కాలంగా నితిన్‌ తన బ్యానర్‌లో నటించాలని కోరుకుంటున్నాడు కనుక పారితోషికం ఇవ్వకుండానే, ఛల్‌ మోహన్‌ రంగ సినిమా నష్టాన్ని భర్తీ చేయాల్సిందిగా కోరగానే వెంటనే నితిన్‌ ఒప్పేసుకున్నాడు. మంచి సినిమాలో నటించాలనే ఉద్దేశ్యంతో దిల్‌రాజు డీల్‌కు నితిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు.

Nithin without remuneration for srinivasa kalyanam