శ్రీనివాస కళ్యాణం మిడిల్‌ డ్రాప్‌

srinivasakalyanam movie collections

నితిన్‌, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విడుదలై వారం రోజులైన ఈ చిత్రం పెద్దగా బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించడంలో విఫలం అయ్యింది. వారాంతంలో కాస్త పర్వాలేదు అనిపించినా కూడా సోమవారం నుండి చాలా చెత్త కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి. సోమ, మంగ్ల వారాల్లో కలెక్షన్స్‌ చూసి నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బుదవారం కలెక్షన్స్‌ చూసి గుండెలు బాదుకుంటున్నారు. బుదవారం ‘గీత గోవిందం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల వారు కూడా గీత గోవిందం వెంట పరిగెత్తారు.

srinivasakalyanam movie collections

సెలవు రోజు అయిన బుదవారం ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రానికి మంచి కలెక్షన్స్‌ వస్తాయని నిర్మాత దిల్‌రాజు భావించాడు. కాని మొత్తం సందడి అంతా కూడా గీత గోవిందం థియేటర్ల వద్ద కనిపించింది. గీత గోవిందం వచ్చిన తర్వాత శ్రీనివాస కళ్యాణం చిత్రం పూర్తిగా డ్రాప్‌ అవ్వడం ఖాయం అని అంతా భావించారు. అనుకున్నట్లుగానే సినిమా కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. కొన్ని థియేటర్లలో షోలు కూడా క్యాన్సిల్‌ అయినట్లుగా ట్రేడ్‌ విశ్లేషకుల నుండి సమాచారం అందుతుంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఊసే కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌లో గోవిందం దుమ్ము రేపేస్తున్నాడు. గీత గోవిందం లేకుంటే ఖచ్చితంగా శ్రీనివాస కళ్యాణం సేఫ్‌ జోన్‌లో పడేదేమో. కాని గోవిందం ఎంట్రీతో శ్రీనివాస కళ్యాణం మిడిల్‌ డ్రాప్‌ అయ్యింది.

srinivasakalyanam-movie--An