కొరటాల డైరీ 2022 వరకు ఖాళీ లేదు…!

Koratala Siva Seems To Be A Very Busy Man in Tollywood Movies

‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా మారిన కొరటాల శివ చేసిన ప్రతి సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకుంటున్నాడు. రాజమౌళి తర్వాత స్థానంలో కొరటాల ఉన్నాడు అంటే ఆయన స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా రికార్డులు నమోదు చేశాయి. అందుకే ఈయనతో సినిమాలు చేసేందుకు ప్రతి ఒక్క స్టార్‌ హీరో ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఇతర దర్శకులతో ఉన్న సినిమాలను క్యాన్సిల్‌ చేసుకుని మరీ ఈయన దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. తాజాగా చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. చిరు 152వ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించాల్సి ఉంది. కాని కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపించడంతో బోయపాటి మరో సినిమాను వెదుక్కుంటున్నాడు.

maheshbabu

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం తర్వాత వరుసగా ఈయన సినిమాలకు కమిట్‌ అయ్యాడు. 2022వ సంవత్సరం వరకు కొరటాల షెడ్యూల్‌ ఖరారు అయ్యింది. ఈయన కోసం స్టార్‌ హీరోలు డేట్లు రెడీ చేసి మరీ పెడుతున్నారు. త్వరలో చేయబోతున్న చిరు 152వ చిత్రంను 2019 వేసవిలో లేదా దసరాకు విడుదల చేయబోతున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో మూవీని మొదలు పెట్టబోతున్నాడు. 2020 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఎన్టీఆర్‌, కొరటాల శివలు ఫిక్స్‌ అయ్యారు. ఆ తర్వాత మహేష్‌బాబుతో భరత్‌ అనే నేను చిత్రానికి సీక్వెల్‌ చేయబోతున్నాడు. 2021లో మహేష్‌బాబుతో చేయబోతున్న కొరటాల శివ, 2022లో రామ్‌ చరణ్‌తో మూవీ చేసేందుకు అప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొత్తానికి కొరటాల శివ ఉన్నంత బిజీగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ దర్శకుడు లేడు అనడంలో సందేహం లేదు.

koratala-shiva