టెంప‌ర్ లో స‌న్నిలియోన్ ఐట‌మ్ సాంగ్

Sunny Leone in Item song for Vishal's Temper

తెలుగులో పూరిజ‌గ‌న్నాధ్ మ‌రియు ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం టెంప‌ర్. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ డ‌మ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న కాజ‌ల్ అగార్వాల్ న‌టించింది. ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క‌ర‌ప్టేడ్ పొలీస్ పాత్రలో న‌టించాడు. ఇప్పుడు ఈ చిత్రంను త‌మిళం, హిందీ భాష‌ల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో ర‌ణ్ వీర్ సింగ్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 3న టీజ‌ర్ ను మ‌రియు అదే నెల చివ‌రి వారంలో విడుద‌ల చేయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Vishal

త‌మిళం లో విశాల్ అయోగ్య పేరుతో వెంక‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో విశాల్ స‌ర‌స‌న రాశి ఖ‌న్నా న‌టిస్తుంది. తెలుగు టెంప‌ర్ చిత్రంలో వున్నా ఐట‌మ్ సాంగ్ ఇట్టాగే రెచ్చిపోదాం అనే సాంగ్ ను త‌మిళ చిత్రం అయోగ్య ఐట‌మ్ సాంగ్ లో స‌న్నిలీయోన్ న‌టిస్తోంది. ఈ ప్ర‌త్యేక మైన పాట కోసం భారీ పారితోష‌కమే ఇచ్చారంటా. తెలుగులో సూప‌ర్ హిట్ అయినా ఈ సినిమా కోసం త‌మిళంలో విశాల్ ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ద తీసుకుంటున్నాడంట‌. ఈ చిత్రంలో విశాల్ పొలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.