మొదటిసారి ఆ ప్రయత్నం చేయబోతున్న బన్నీ

Allu Arjun To Reprise The Role Of Vijay Sethupathi In The Remake Of 96

అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత మ‌రో సినిమా లో న‌టించ‌డానికి చాలా కాలం ప‌ట్టింది. త్రివిక్రమ్ దర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ బ‌న్ని సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే త‌మిళంలో విజ‌య్ సెతుప‌తి, త్రిష న‌టించిన 96 సినిమా ఇటివ‌ల విడుద‌లై అక్క‌డ మంచి విజ‌యంను ద‌క్కించుకుంది.

allu-arjun

వైవిద్య‌భ‌రిత‌మైనా సినిమాల్లో 96 మూవీ ఒక్క‌టి. ఇటివ‌ల‌ అల్లు అర్జున్ త‌మిళ‌ 96 మూవీని చూశాడు అంట సినిమా భాగా న‌చ్చ‌డంతో తెలుగు రీమేక్ లో న‌టించ‌డానికి అస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తుంది.త‌మిళ 96 మూవీ రీమేక్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజ్ ద‌క్కించుకున్నాడు. మొద‌ట త్రివిక్ర‌మ్ తో సినిమాను పూర్తి చేసిన త‌ర్వాతనే 96 మూవీ గురించి అలోచిస్తాడంట‌. దిల్ రాజు ప్రస్తుతం సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేయించే పనిలో ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రముఖ దర్శకుడు ఈ రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. బన్నీ ఇప్పటి వరకు రీమేక్ ల జోలికి వెళ్లింది లేదు. ఇప్పుడు మొదటి సారి ఆ ప్రయత్నం చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

Dil Raju Could Not Find Actors For 96 Remake