ఆసక్తిరేపుతున్న ‘కేరాఫ్‌ కంచరపాలెం’…!

Rana Seals C/O Kancharapalem Release Date

ఈమద్య కాలంలో చిన్న చిత్రాలు పెద్ద విజయాలను దక్కించుకుంటున్నాయి. పెద్ద నిర్మాతలు కూడా చిన్న చిత్రాల వెంట పరుగులు తీస్తున్నారు. ఎంతో మంది ట్యాలెంటెడ్‌ దర్శకులు ఈమద్య కాలంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ కోవకు చెందిన సినిమానే ‘కేరాఫ్‌ కంచరపాలెం’. విభిన్నమైన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రం నిర్మాణం జరగడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పెద్ద బ్యానర్‌ అవ్వడంతో అంచనాలు అయితే బాగా ఉన్నాయి కాని సినిమాలో స్టఫ్‌ ఉందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని టీజర్‌ విడుదల తర్వాత సినిమా ఖచ్చితంగా విభిన్నంగా ఉండి ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

rana

రానా సమర్పణలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే అరుదైన గౌరవంను దక్కించుకుంది. న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శణకు ఎంపిక కావడం, అక్కడ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం జరిగింది. ఈ చిత్రంలో అంతా కొత్తవారే నటించినా కూడా టీజర్‌ విడుదలైన వెంటనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకటేష్‌ మహా దర్శకత్వం వహించాడు. కథ బాగా నచ్చడంతో స్వయంగా రానా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తప్పకుండా ఒక రేంజ్‌లో ఆడుతుందనే అభిప్రాయం అప్పుడే సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

kancharapalem