లోకేష్ ఎందుకంత డేంజరస్ ?

pawan-kalyan-target-on-nara

గడిచిన రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పరిశీలిస్తే ఓ విషయం బాగా అర్ధం అవుతుంది. అదే మిషన్ లోకేష్. సీఎం చంద్రబాబు టార్గెట్ గా ఇన్నాళ్లు రాజకీయాలు నడిపిస్తూ వస్తున్న రాజకీయ ప్రత్యర్ధులు ఇటీవల తమ టార్గెట్ మార్చుకున్నట్టు వుంది. అక్కడ కేంద్రంలో బీజేపీ కి వత్తాసు పలుకుతున్న జీవీఎల్ లాంటి నాయకులు మొదలుకుని ఇక్కడ వైసీపీ నేత విజయసాయి దాకా అంతా లోకేష్ జపమే చేస్తున్నారు. ఇక జనాల్లో చురుగ్గా తిరుగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి తప్పుకి లోకేష్ కారణం అని, ఆయన లేకుంటే ఆంధ్రప్రదేశ్ స్వర్గతుల్యం అవుతుందన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. పైగా తాను అధికారంలోకి వస్తే లోకేష్ ని క్షమించేదిలేదని గట్టిగానే చెబుతున్నారు.

naralokesh-and-pawan-kalyan

ఎందుకిలా ? ఒక్కసారిగా టీడీపీ రాజకీయ ప్రత్యర్ధులు మొత్తం సీఎం చంద్రబాబుని వదిలేసి లోకేష్ ని టార్గెట్ చేయడం వెనుక ఏదైనా వ్యూహం , లక్ష్యం వుందా ? లేక నిజంగా లోకేష్ వీళ్లంతా చెప్పినంత డేంజరస్ అనిపిస్తున్నారా ?
పై ప్రశ్నలకు కాస్త లోతుగా సమాధానం వెదుక్కుంటే అసలు విషయం బోధపడుతుంది. నిజానికి లోకేష్ మీద పడుతున్న అందరి టార్గెట్ చంద్రబాబు మాత్రమే. అసలు వ్యూహం ఆపరేషన్ గరుడలోని ఇంకో అంకం. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గెలుపు మీద ధీమాగా వున్న చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఈసారి చురుకైన పాత్ర పోషించే అవకాశాలు వున్నాయి. అదే జరిగితే నరేంద్ర మోడీకి మళ్లీ పీఎం పీఠం దక్కదన్న భయం ఆయన అనుచరుల్లో బలంగా వుంది. మోడీ, అమిత్ షా కూడా ఇదే భావిస్తున్నారు.

nara-lokesh

చంద్రబాబు జాతీయ రాజకీయాల వైపు చూసాడంటే వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ కి చాలినంత మెజారిటీ రాకుంటే మోడీకి ప్రత్యామ్న్యాయంగా ఇంకో నాయకుడిని ముందుకు తెచ్చేందుకు చంద్రబాబు వెనుకాడడని తెలుసు. ఈ లెక్కలన్నీ వేసుకుని ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చంద్రబాబు ఎన్నికల రాజకీయం చేసేలా చూడాలని మోడీ అండ్ కో భావన. అందుకోసం లోకేష్ ని టార్గెట్ చేస్తే కొడుకు సామర్ధ్యం మీద అపనమ్మకంతో చంద్రబాబు తనకు తానుగా జాతీయ రాజకీయాల్ని పక్కనబెట్టి ఆంధ్రా పై కన్నేస్తాడని మోడీ అండ్ కో భావన. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ కి చంద్రబాబు వ్యూహాలు తోడు అయితే తాము రేసులో లేకుండా పోతామన్న భయంతో లోకేష్ పేరుని ముందు పెట్టి వీళ్లంతా రాజకీయం చేస్తున్నారు. మోడీనే సమర్ధంగా ఢీకొట్టిన బాబు వీళ్ళ వ్యూహాల్ని కౌంటర్ చేయలేడా?

cbn-and-nara-lokesh