ఉరేసుకుంటున్న భార్య…ఆపకుండా వీడియో తీసిన భర్త

Wife of the wanderer ... the husband who took the video without stopping

తనతో గొడవ పడిన భార్య, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లి గడియ వేసుకుని, ఉరేసుకుంటుంటే, ఆమెను కాపాడే ప్రయత్నం చేయకపోగా పైపెచ్చు కిటికీలో నుంచి వీడియో తీశాడో కిలాడీ భర్త. ఈ విషయాన్ని మళ్ళీ అతనే పోలీసులకు చెప్పడంతో వారు విస్తుపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 2007లో ప్రేమ వివాహం చేసుకున్న అరుణ (31), శ్రీనివాస్‌ (35) కాపురం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉండగా  తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని అరుణ తరచూ ఘర్షణ పడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్యా మరోమారు గొడవ జరుగగా, అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, అరుణ ముక్కు, నోటి నుంచి రక్తం కారడం, ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్య కేసుగా అనుమానిస్తూ, శ్రీనివాస్ ను విచారించారు. భార్య ఉరేసుకున్న తరువాత, తానే ఓ కర్ర సాయంతో గది తలుపు తెరిచానని, ఆమెను కిందకు దించే సమయంలో కిందపడిందని, దాంతోనే ముఖంపై గాయాలు అయ్యుంటాయని శ్రీనివాస్ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే తమ కుమార్తెను భర్తే హత్య చేశాడని, ఆపై ఆత్మహత్యగా చిత్రిస్తున్నాడని శ్రీనివాస్ పై అరుణ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.