డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్ బెయిన్‌ను తిరస్కరించిన ధర్మాసనం ఈసారైనా బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరగనుంది. గతవారమే ఆర్యన్‌కు బెయిల్ వస్తుందని అంతా భావించినా కోర్టు షాకిచ్చింది. దీంతో ఈసారైనా బెయిల్ వస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది.
అయితే ఒకవేళ ఆర్యన్‌కు ఈ వారంలో బెయిల్ రాకపోతే మాత్రం అతను మరో 14 రోజుల పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వచ్చే నెల1వ తేదీ నుంచి ముంబై హైకోర్టుకు వరుసగా దీపావళి సెలవులు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు ముంబై హైకోర్టుకు సెలవులు కావడంతో నేడు జరిగే విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కొడుకు అరెస్ట్‌తో షారుక్ దంపతులు తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నట్లు సమాచారం.
అటు షారుక్‌ఖాన్ భార్య గౌరీ ఖాన్ అయితే కొడుకు బెయిల్ కోసం నిత్యం పూజలు చేస్తుందని, ఆర్యన్ విడుదల కావాలంటూ భగవతుండ్ని పప్రార్థించమని తన స్నేహితులకు కూడా విన్నవించుకుంటుందట. కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లో స్వీట్స్ వండొద్దని ఇప్పటికే గౌరీ ఖాన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. పుట్టినరోజు, పండుగలను కూడా జరుపుకోవడం లేదు. కొడుకు ఇంటికి వచ్చాకే అన్ని పండుగలు అన్ని గౌరీ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.