పవన్ భక్తుడు…పవన్ కి షాకిస్తాడా ?

Will Bandla Ganesh Ready To Join Congress Party

అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే అధికారం అంటే సీఎం కావాలంటున్నారు. అందుకోసం గత ఎన్నికల్లో కలిసి పని చేసిన టీడీపీకే ఎదురువెళ్ళి పోరాటం చేస్తున్నాడు. ప్రజా పోరాట యాత్ర పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన పవన్ కొద్దిరోజులు ఉత్తరాంధ్రలో పర్యటించి, ప్రస్తుతానికి రంజాన్ బ్రేక్ పేరుతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రచారం పవన్ జనసేనానికి షాకిచ్చే అంశంగానే కనపడుతోంది. పవన్ కోసం ఏదయినా చేస్తాను, నేను ఆయన భక్తుడిని అని చెప్పుకునే నిర్మాత బండ త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

బండ్ల గ‌ణేష్, టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌రిచియ‌మై ఇటీవాలి కాలంలో పెద్ద నిర్మాత‌ అవతారం ఎత్తాడు. ఇంత త‌క్కువ కాలంలో బండ్ల గ‌ణేష్ అలా ఎలా ఎదిగాడు అనే అందరిని తోలిచేసే అనుమానమే, ఆయ‌న ఓ రాజ‌కీయ నేత‌కు బినామిగా ఉన్నాడ‌నే వార్త‌లు బాగానే వినిపించాయి. అయితే ఇదే విషయంలో ఓ ఇంట‌ర్య్వూ సందర్భంగా యాంకర్ అడగగా మీకు ట్రంప్‌తో దిగి ఫోటో పంప‌మంటారా అని ఆ యాంక‌ర్‌కి షాక్ ఇచ్చాడు బండ్ల గ‌ణేష్‌.మెగా ఫ్యామిలీ అంటే పడి చచ్చే బండ్ల గణేష్ ఎవరూ పిలవకపోయినా పవన్ తరపున వాకాల్తా పుచ్చుకుని మరీ మాట్లాడుతుంటాడు. గతంలో పవన్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన గణేష్.. ఆ మధ్య పవన్‌తో రెండు సినిమాలను కూడా నిర్మించాడు.

ఇటీవల ఓ చానెల్‌లో వచ్చిన డిబెట్‌లో పవన్‌ను విమర్శించిందని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే అలాంటి పవన్ కల్యాణ్ వీరాభిమాని కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు చూస్తే అందరికీ ఇదే అనుమానం కలుగుతోంది. పవన్‌కు సపోర్టు చేసే గణేష్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన ఓ పోస్టు రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. జూన్ 19 రాహుల్ గాంధీ పుట్టినరోజున ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్. మీరే భారతదేశానికి భవిష్యత్తు’’ అని ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఇది చూసాక మీడియా ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని ప్రచారం మొదలుపెట్టేసింది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తరువాత పొలిటికల్‌గా పవన్ పిలుపుకోసం ఎదురు చూశారు బండ్ల గణేష్. పవన్ పిలుపు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆయన పిలవాలే కాని ఆయన వెంట నడిచేందుకు రెడీ అని మనసులో మాట బయటపెట్టారు బండ్ల. అయితే పవన్ నుండి పెద్దగా సానుకూల మైన పవనాలు వీచకపోవడంతో బండ్ల గణేష్ సైలెంట్ అయ్యారు. నిజానికి బండ్ల గణేష్‌కు కాంగ్రెస్‌ నేతలో సంబంధాలు ఉన్నాయి. బండ్ల గణేష్ నిర్మాతగా ఎదగడం వెనుక అప్పటి ఓ కాంగ్రెస్ నేత ఉన్నారనే ప్రచారం కూడా సాగేది అయితే అలాంటిది ఏమీ లేదని గణేష్ అన్నా తాజాగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఫోటో దిగటం ఆ ఫోటోను షేర్ చేయడం.. ‘మీరే దేశ భ‌విష్య‌త్తు’ అంటూ రాహుల్‌ని ఎత్తేయడం చూస్తుంటే దీని వెనుక ఇంకేమి అర్ధం ఉందా ? అని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారట.