మోడీ, చంద్రబాబు కలుస్తున్నారా ?

Will modi and Chandra babu face each other in niti aayog meeting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాలుగేళ్ల పాటు ఎన్డీయే ప్రభుత్వంలో ఉండి హోదా హామీ నెరవేర్చనందుకు బయటకి వచ్చేసింది తెలుగుదేశం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి.. అధికారంలోకి వచ్చిన ఈ రెండు పార్టీలు విడిపోవడం తెలుగుదేశం పార్టీ కేంద్రమంత్రులు ఎన్డీయే ప్రభుత్వానికి రాజీనామా చేసి బయటకి రావడం, ఆ వెంటనే బీజేపీ కూడా ఏపీ మంత్రి వర్గం నుంచి బయటకు రావడం చకచకా జరిగిపోయింది. అప్పటి నుండి బీజేపీ, టీడీపీల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి ఇచ్చిన హామీలని నెరవేర్చని బీజేపీని చంద్రబాబు విమర్శిస్తూ నిధుల కేటాయింపులో కూడా మోడీ అన్యాయం చేశారని బాబు అంటుంటే, కేటాయింపులు బాగున్నాయని అంటూ అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసింది మీరీ కదా అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ప్రతుతం మహానాడు వేదికగా బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్వరలోనే చంద్రబాబు, ప్రధాని మోడీలు ఎదురుపడనున్నారనే కధనం ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జూన్‌ 16న దిల్లీలో నీతిఆయోగ్‌ ఒక సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిసింది. నీతిఆయోగ్‌ ఛైర్మన్‌.. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు నీతిఆయోగ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందినట్లు తెలిసింది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల నేపథ్యంలో కేంద్రం తమకు అన్యాయం చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ దక్షిణాది రాష్ట్రాలతో పాటు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి సీఎంలు, ఆర్థిక మంత్రులు అందరూ ఏకమై ఇటీవలే సమావేశాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో.. ఈ సమావేశం కీలకం అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మోడీ తో చంద్రబాబు భేటి అవుతారా? కలుస్తారా? ఎదురు పడతారా ? ఎదురు పడితే చేతులు కలుపుతారా? అసలు మొహమొహాలు చూసుకుంటారా? ఒకరి మొహం ఒకరు చూడకుండా ముఖాలు పక్కకు తిప్పుకుంటారా? దూరం నుంచే ఓ నమస్కారంతో సరిపెడతారా? బాబు బదులు వేరొకరిని పంపుతారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఏమి జరుగుతుందో తెలియాలి అంటే 16వ తేదీవరకు వేచి చూడాల్సిందే !