“‘పుష్ప 2’కు వంద కోట్లు దాటుతాయా ?”

"Will 'Pushpa 2' cross 100 crores?"
"Will 'Pushpa 2' cross 100 crores?"

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న మూవీ ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, రెండు సాంగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో పుష్పకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది . మరోవైపు తెలుగు మూవీ ల మార్కెట్ రోజురోజుకి బాలీవుడ్ లో పెరుగుతుంది.

"Will 'Pushpa 2' cross 100 crores?"
“Will ‘Pushpa 2’ cross 100 crores?”

పైగా ఈ మధ్య హిందీ ప్రేక్షకులు కంటెంట్ ఉన్న మూవీ లను నెత్తిన పెట్టుకుంటున్నారు. శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 సినిమా ఓవరాల్ గా రూ. 600 కోట్ల గ్రాస్ రాబట్టేలా ఉన్నది . అంటే.. కంటెంట్ కనెక్ట్ అయితే ఆ మూవీ కి వందల కోట్ల వసూళ్లు రావడం పక్కా. మరి ఈ నేపథ్యంలో పుష్ప 2 కు మంచి పాజిటివ్ టాక్ వస్తే.. రూ.1000 కోట్లు రావొచ్చు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగూ, అన్ని భాషల ఆడియన్స్ లో ఈ మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ సినిమా లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మైత్రి సినిమా మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.