శుక్రవారం అర్దరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగగా బస్సులుఅన్నీ నిలిచిపోయాయి. పండగకు సొంతఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రజలకు నిరాశేఎదురై చాలాఇబ్బంది పడేఅవకాశం ఉంది. టికెట్ రిజర్వేషన్లు చేసుకున్నవారికి ప్రత్నామ్నాయ ఏర్పాట్లుచేస్తారా అనేది తెలియకుండా ఉంది.టికెట్ కాన్సిల్ చేసి తిరిగి డబ్బులు ఇస్తారా అనేది స్పష్టతలేదు.ముందుగా రిజర్వేషన్లు చేసుకున్నవారు డైలమాలో పడిపోయారు.
సమ్మెకారణంగా టికెట్ రిజర్వేషన్ను ఇప్పుడు రద్దు చేసుకున్నా డబ్బులు కట్ అవుతున్నాయి. టికెట్లను కాన్సిల్ చేసుకోకుండా ఉంటే డబ్బులను తిరిగి ఇస్తారో లేదో అనుమానం కూడా ఉంది. సంబందించిన వివరాలకి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కి సమాచారం కోసం వెళితే రిజర్వేషన్ కౌంటర్లు మూసి ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంది.