తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి కేసీఆర్ ను గద్దె దించాలని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇవాళ ఆదిలాబాద్ లో జనగర్జన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు మేలు జరుగలేదని.. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని తెలిపారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ కొత్త బట్టలు వేసుకొని వస్తుందన్నారు.
మోడీ నేత్వంలో మహిళా బిల్లు కల సహకారం చేశామని తెలిపారు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆదిలాబాద్ ఆదివాసుల కోసం కేసీఆర్ ఏం చేశారు. కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మ కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు. కేసీఆర్ లక్ష్యం కొడుకును సీఎం చేయడానికే అని తెలిపారు. తెలంగాణలో పసుపు బోర్డు, కృష్ణా నీటి బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పేదలు, మహిళలకు మేలు జరిగిందంటే.. మోడీ ప్రభుత్వంలోనే అని పేర్కొన్నారు అమిత్ షా. డిసెంబర్ 03న బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు అమిత్ షా.