మందుబాబులకు ఊహించని షాక్

మందుబాబులకు ఊహించని షాక్

మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. హుజురాబాద్‌లో శనివారం ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటల నుంచి 30వ తేదీ రాత్రి 7 గంటల వరకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ నిన్ననే ఆదేశాలిచ్చారు. ఆ మేరకు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వైన్‌షాపులన్నీ గురువారం రాత్రి 7 గంటల నుంచే మూతపడ్డాయి. శనివారం పోలింగ్ సమయం ముగిసిన తర్వాతే మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.

అయితే జిల్లా కలెక్టర్ సడెన్‌గా ఇచ్చిన ఆదేశాలతో మందుబాబులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ మూడు రోజులు మద్యం ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రలోభాల్లో భాగంగా రాజకీయ పార్టీలు ముందుగా సరుకును రిజర్వ్ చేసి పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూడు రోజులు వైన్‌షాపులు మూతపడినా మందుబాబులు ఆందోళన చెందనక్కర్లేదని, పోలింగ్ పూర్తయ్యేవరకు రాజకీయ పార్టీలే ఫ్రీగా మద్యం పంపిణీ చేస్తాయని కొందరు సెటైర్లు వేస్తున్నాయి.