శరీరంలో వేడిని తగ్గిస్తుంది

శరీరంలో వేడిని తగ్గిస్తుంది

సాయంకాలం 5 గంటలు దాటితే చాలు ప్రజలు చలికి గజ గజ వణికిపోతుంటారు. ఉదయం అయితే బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతుంటారు. దీని నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి స్వెటర్లు, కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లౌజులు వంటివి ఉపయోగిస్తాం. అయితే శరీరం బయట రక్షణ వరకు ఎలాగోలా గడిచిపోతుంది. మరీ శరీరం లోపలి సంగతేంటో ఆలోచించారా? ఎందుకంటే కాలాన్ని బట్టి ఆహార నియమాలను పాటించాలి. ఆ సీజన్‌లో వచ్చే పండ్లు మరియు కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటి వల్ల మన శరీరానికి అన్ని రకాల పోషకాలు, ప్రోటీన్లు, న్యూట్రిన్లు పుష్కలంగా లభిస్తాయి. అప్పుడే మన జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది.

వింటర్ రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి అనువైన సమయం. సీజనల్ కూరగాయలు, పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. అయితే ఇవి తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో దొరికే కూరగాయలు, పండ్లపై కచ్చితంగా పురుగుమందుల ప్రభావం ఉంటుంది. అందుకే వాటిని శుభ్రం చేసిన తర్వాతనే తినడం చేయాలి. ఈ విషయాన్ని మాత్రం అందరు గుర్తుంచుకోవాలి. అయితే చలికాలంలో తినాల్సిన ఆహారాల గురించి ఓ లుక్కేద్దాం.

బీట్రూట్‌లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బీట్రూట్‌లో క్యాలరీలు తక్కువగా, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. దీనిలో బీటాలైన్స్, ఐరన్, మాంగనీస్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. విటమిన్ కె, క్యాల్షియం, ఫోలేట్(విటమిన్ బీ9), విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి.

మరి, బీట్రూట్‌ను ఆహారంగా ఎలా తీసుకోవాలి? అన్న విషయానికి వస్తే ఈ దుంప పచ్చిది తిన్నా.. వండుకొని తిన్నా.. జ్యూస్ చేసుకొని తాగినా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జ్యూస్ ద్వారా బెటాలిన్స్ మనకు అందితే.. బీట్రూట్ తినడం ద్వారా మనకు అవసరమైన పీచుపదార్థం లభిస్తుంది. బీట్రూట్ దుంప మాత్రమే కాదు.. దాని ఆకులను ఆహారంగా తీసుకొన్నా.. మనకు మంచి ప్రయోజనం కలుగుతుంది. సాధారణంగా మూడు రంగుల్లో బీట్రూట్లు ఉంటాయి. దేన్ని ఆహారంగా తీసుకొన్నా కూడా.. కలిగే ప్రయోజనం దాదాపుగా ఒకటే. తెలుపు, పింక్, బంగారు వర్ణంలో బీట్రూట్లు మనకు లభిస్తాయి. సాధారణంగా మన దేశంలో పర్పుల్ రంగులో ఉన్న బీట్రూట్లే లభిస్తాయి.

ముల్లంగితో అనేక రకాల రెసిపీస్ మనం తయారు చేసుకుంటూ ఉంటాం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కేవలం ఇది మంచి రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు చూశారంటే తప్పక రోజు తీసుకోవడం మొదలు పెడతారు. ముల్లంగి తీసుకోవడం వల్ల జాండీస్ నుండి కాపాడుతుంది. లివర్ మరియు కడుపును మంచి కండిషన్ లో పెడుతుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది కూడా.

ముల్లంగిలో విటమిన్ సీ, ఫాస్ఫరస్, జింక్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి. చర్మ సమస్యలు తొలగించడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. అలానే మంచి మాయిశ్చరైజర్‌గా క్లెన్సర్‌గానూ కూడా ఉపయోగించవచ్చు. ముల్లంగితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం సున్నితంగా అందంగా మారుతుంది. చూశారా ముల్లంగి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మరి వీటిని అనుసరించండి. అందంగా, ఆరోగ్యంగా ఉండండి.

క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తలెత్తవు. మ‌హిళ‌లు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ దూరమవుతుంది. క్యారెట్లలో వుండే విటమిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. క్యారట్ జ్యూస్ ద్వారా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చిన్నప్పుడు విరివిగా దొరికెవి ఇపుడు ఖరీదుగా మారిపోయాయి. అలాంటివి బోలెడు ఉన్నాయ్. వాటిలో చిలకడ దుంప కూడా ఉంటుంది. కూరలనుండి వేపుడు వరకు. ఉడికించుకుని, కాల్చుకుని తినడం నుండి పచ్చిదే కొబ్బరిలా తినేయడం వరకు ఎన్నో రకాలతో కనువిందు చేస్తుంది. ఈమధ్య అయితే చిలకడ దుంప పూర్ణాలు, బొబ్బట్లు కూడా తయారైపోతున్నాయ్. దుంపల్లో అన్నిటిలోకి విభిన్నమైన చిలకడ దుంప తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

మనిషి శరీరానికి ప్రయోజనాలు కలిగించే ఆకుకూరల్లో పాల కూర ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఆకుకూరల్లోనే పాలకూర ఎంతో మేలైనదీ. పాల కూర తినటం వల్ల అనేక రోగాలు మనదరి చేరకుండా చూసుకోవచ్చు. పాల కూరలో యాంటీ ఆక్సీ డెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు దూరంఅవుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్ కె లభిస్తుంది. మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు. పాల కూరలో వివిధరకాల డిజైన్లు, రంగులు, ఫ్లేవర్లున్నాయి. బర్గర్లు, సలాడ్లు, శాండ్ విచ్లు,సూప్స్ లో పాల కూరను ఎక్కువగా వినియోగిస్తారు.

ఓ కప్పు పాలకూరలో 5 కేలరీలు మాత్రమే ఉంటాయి. సోడియం మాత్రం 10 గ్రాములు వరకు ఉంటుంది. ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అసలు ఉండవు. పాలకూర మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు, ఆస్థియోడైనియా పోగొడుతుంది. బరువు తగ్గాలనుకున్నవారు పాలకూర తినటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఒక్కో ఆకు కూరతో శరీరానికి అనేక లాభాలున్నాయి. ఇందులో ముఖ్యంగా మెంతికూర. ఇది కూర రుచిని పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుండంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మెంతి గింజలు అనేక ప్రయోజనాలు అందిస్తాయని అందరికి తెలిసిన విషయమే. వీటితోపాటు.. మెంతి ఆకులు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. ఇందులో ఐరన్, సెలీనియం, కాల్షియం, మాంగనీస్, మినరల్స్, జింక్ వంటి పోషకాలున్నాయి.

ఇవి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎక్కువగా సహాయపడతాయి.పచ్చి మెంతి ఆకులు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యలో చక్కర స్తాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా.. ఇవి మంచి కొలెస్ట్రాల్‏ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. మెంతి ఆకులలో పీచు జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.