ఐటీ కంపెనీలో అన్ని మట్టికుండలా?

http://telugubullet.com/wp-content/uploads/2017/06/wipro-it-company-distribute.jpg

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో రెండురోజులుగా మట్టికుండలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇదేంటా అని ఆశ్చర్యపోయి ఆరా తీసినవారికి ఆ సంస్థ సామాజిక బాధ్యతగా చేపట్టిన ఓ మంచి పని గురించి బయటకు తెలిసింది.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5 న సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మట్టికుండలు ఉచితంగా పంపిణీ చేసింది. పర్యావరణం పట్ల తమ ఉద్యోగుల్లో అవగాహన పెంచడమే ఈ మట్టికుండల పంపిణీ ఉద్దేశం. పల్లెల నుంచి వచ్చిన వారు మట్టికుండల వాడకాన్ని ఎప్పుడో మరిచిపోయారు.ఇక పట్టణాలు,నగరాలు నుంచి వచ్చిన వారికి మట్టికుండలు వాడతారన్న విషయం తెలియడమే గొప్ప. ఈ పరిస్థితుల్లో సంస్థ ఇచ్చిన మట్టికుండలు చూసి ఉద్యోగులు చాలా మంది ఆశ్చర్యపోయారు.పర్యావరణం మీద అవగాహన వున్నవాళ్లు సంతోషించారు.మొత్తానికి ఐటీ కంపెనీలో మట్టికుండల పంపిణీ కాస్త ఆసక్తికరమే.