మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ గా చిరంజీవి నిలిచారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మందిని అలరించాడు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న చిరంజీవి ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేస్తూ ఉంటాడు.
అలాంటి చిరంజీవి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల 650 కోట్ల రూపాయల నష్టం చిరంజీవికి వచ్చింది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు చిరంజీవి అంత పెద్ద తప్పు ఎలా చేశారు అని షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే…నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా సినిమా ‘జైలర్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొన్ని కోట్ల రూపాయల కనెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రజనీకాంత్ కెరీర్లో నిలిచిపోయింది. అయితే ఈ మూవీ లో మొదట హీరోగా రజనీకాంత్ ను కాకుండా చిరంజీవిని అనుకున్నారట. ఈ సినిమా కథను నెల్సన్ మొదటగా చిరంజీవికి వినిపించారంట .
కానీ చిరంజీవి ఈ స్టోరీ విన్న తర్వాత తన క్యారెక్టర్ కి చాలా ఆపోజిట్ గా ఉందని, అంతేకాకుండా ఏమాత్రం కామెడీ లేకుండా ఈ సినిమా ఉండడంతో చూద్దాంలే అన్నట్టుగా చాలా లైట్ తీసుకొని డైరెక్టర్ కు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదట. దీంతో నెల్సన్ ఈ స్టోరీని రజినీకాంత్ కి వినిపించారట. రజనీకాంత్ ఈ స్టోరీ విన్న వెంటనే ఓకే చెప్పడంతో చాలా తొందరగా ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించి సినిమాని కంప్లీట్ చేశారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి మంచి వసూళ్లను రాబట్టింది. దాదాపు 650 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. దీంతో చిరంజీవి కొట్టాల్సిన హిట్ కాస్త రజనీకాంత్ ఖాతాలో పడిపోయి 650 కోట్ల కలెక్షన్ల నష్టం చిరంజీవికి వచ్చింది.