కోడలిని హత్య చేసిన మామ

తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని జంగాలపురంలో కోడలిని హత్య చేసిన మామ నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. గ్రామనికి చెందిన మణి కొడుకు శివన్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు. శివన్‌ భార్య మురుగమ్మాల్‌ రెండేళ్ల క్రితం గజనాయకన్‌పట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరింది. ఆమె నకిలీ సర్టిఫికెట్లు​ ఇచ్చినట్లు రుజువుకావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో దంపతుల మధ్య తరచూ ఘర్షణ జరగుతోంది. వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. మురుగమ్మాల్‌ కొడుకు, కుమార్తెతో కలిసి గజనాయకన్‌పట్టిలో ఉంటోంది. మంగళవారం మురుగమ్మాల్‌ జంగాలపురం వచ్చింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో తమ ఇంటికి ఎందుకు వచ్చావని మామ శివన్‌ నిలదీయడంతో గొడవ జరిగింది. బుధవారం ఉదయం మరోసారి ఘర్షణ పడ్డారు. ఆగ్రహించిన మణి ఇంటిలో ఉన్న కత్తితో మురుగమ్మాల్‌ను హత్య చేసి పోలీస్‌స్టేషన్లో లొంగిపోయాడు.

తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని జంగాలపురంలో కోడలిని హత్య చేసిన మామ నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. గ్రామనికి చెందిన మణి కొడుకు శివన్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు. శివన్‌ భార్య మురుగమ్మాల్‌ రెండేళ్ల క్రితం గజనాయకన్‌పట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరింది. ఆమె నకిలీ సర్టిఫికెట్లు​ ఇచ్చినట్లు రుజువుకావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు.

దీంతో దంపతుల మధ్య తరచూ ఘర్షణ జరగుతోంది. వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. మురుగమ్మాల్‌ కొడుకు, కుమార్తెతో కలిసి గజనాయకన్‌పట్టిలో ఉంటోంది. మంగళవారం మురుగమ్మాల్‌ జంగాలపురం వచ్చింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో తమ ఇంటికి ఎందుకు వచ్చావని మామ శివన్‌ నిలదీయడంతో గొడవ జరిగింది. బుధవారం ఉదయం మరోసారి ఘర్షణ పడ్డారు. ఆగ్రహించిన మణి ఇంటిలో ఉన్న కత్తితో మురుగమ్మాల్‌ను హత్య చేసి పోలీస్‌స్టేషన్లో లొంగిపోయాడు.