మాదకద్రవ్యాలు మనుషులను మృగాలుగా ఎలా మారుస్తున్నాయో చాటి చెప్పే ఘటన ఇది. తనకు సెక్స్ సుఖం కావాలని కోరినా తనతో అది చేయడం లేదనే కోపంతో డ్రగ్స్ మద్యం మత్తులో తన భర్తను చితకబాదిందో భార్య. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఎరికా యోడర్ అనే మహిళ పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త తనపై దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను పరిశీలిస్తే ఎలాంటి గాయాలు కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో ఉన్న పిల్లలను ఏం జరిగిందని అడగగా దానికి వాళ్లు తండ్రి, తల్లి మీద దాడి చేయలేదని ఆమె డాడిని కొట్టిందని చెప్పారు. దాంతో భర్తను ప్రశ్నించగా రాత్రి 12 గంటల సమయంలో ఫుల్లుగా తాగి వచ్చిన ఎరికా యోడర్ వచ్చీ రాగానే భర్త దగ్గరికి వచ్చి సెక్స్ కావాలంటూ అడిగిందట. డ్రగ్స్ మత్తులో ఉన్న ఎరికా యోడర్ వాలకం చూసి అతను ఆ పనికి ఒప్పుకోలేదు. పిల్లల ముందు భార్య ప్రవర్తన చూసి ఇప్పుడు కాదని పక్కకి తోసే శాడు. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఎరికా భర్తను చేతికి అందిన వస్తువు తీసుకుని చితక్కొట్టింది. ఆ తర్వాత మరోసారి తనతో అది చేయాలంటూ భర్తను ఫోర్స్ చేసింది. అయినా అతను వినలేదు. దాంతో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించిన ఆమె పోలీసులకు ఫోన్ చేసి భర్తే తనపై దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.