ప్రియురాలిని హతమార్చాడు

ప్రియురాలిని హతమార్చాడు

చీరతో గొంతు బిగించి ప్రియురాలిని హతమార్చిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై రెడ్‌హిల్స్, గాంధీనగర్‌కు చెందిన నారాయణన్‌ (40) కట్టడ కార్మికుడు. భార్య మోహన (36). ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు దాస్‌తో మోహనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం సాయంత్రం మోహన, దాస్‌ మధ్య వాగ్వాదం ఏర్పడింది.

దీంతో ఆగ్రహించిన దాస్‌ ఇంటి తలుపులు మూసి వేగంగా బయలుదేరాడు. అతను ఆక్రోశంతో వెళ్లడం చూసిన ఇరుగుపొరుగువారు అనుమానంతో చోళవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచి లోనికి వెళ్లగా చీరతో గొంతు బిగించిన స్థితిలో మోహన హత్యకు గురైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దాస్‌ కోసం గాలిస్తున్నారు.