కష్టపడి పైసా పైసా కూడబెట్టి, భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళా రైతు భూ వివాదం కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్‌కు చెందిన మునిగె లావణ్య(33) అదే గ్రామానికి చెందినవారి వద్ద 2015లో రెండు ఎకరాల భూమిని రూ.1.50 లక్షలకు కొనుగోలు చేసింది. సాదాబైనామా రాయించుకొని, అప్పటి నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తోంది. విదేశాలకు వెళ్లిన తన భర్త శంకర్ తిరిగి వచ్చిన తర్వాత భూమి అమ్మినవారిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరారు. దీనికి వారు నిరాకరించారు. మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం.. మా భూమి మాకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయమై గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో సదరు భూమిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన లావణ్యను నలువాల రవి, ఎల్లయ్య, లత, ఎల్లవ్వ దుర్భాషలాడుతూ చంపుతా మని బెదిరించారు. మనస్తాపానికి గు రైన బాధితురాలు ఆదివారం రాత్రి 8 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పు రుగుల మందు తాగింది. అనంతరం ఆమె బ యటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు భర్త శంకర్‌కు సమాచారం ఇచ్చారు. వెంట నే ఆమెను సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలి పారు. మృతురాలికి కొడుకు గౌతమ్, కూతురు వైష్ణవిలు ఉన్నారు. తన భార్య ఆత్మహత్యకు న లువాల రవి, ఎల్లయ్య, లత, ఎల్లవ్వలు కారణ మని శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, ద ర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.