ఓ యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు లైంగికదాడి చేశారు. ఇంట్లో బంధించి మూడ్రోజులు చిత్రహింసలు పెట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణంలోని మాతానగర్‌కు చెందిన బాధితురాలు ఈ నెల 15న రాత్రి 9.30 గంటల సమయంలో బయటకు వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన గౌస్, సాయిరాంరెడ్డి.. ముత్యాలమ్మవీధిలో ఆ యువతిని ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి బలవంతంగా తాగించారు.మూడ్రోజులు చిత్రహింసలకు గురి చేస్తూ లైంగిక దాడి చేశారు.
ఆమె తలను గోడ కు బాదారు. బాధితురాలి కేకలు విని సోమ వారం చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వెళ్లి చూశా రు. ఆ యువతి కుటుంబీకులు తెలిసినవాళ్లే కావడంతో వెంటనే సమాచారం ఇచ్చారు. అప్పటికే యువతి గురించి వెతుకుతున్న కు టుంబీకులు అక్కడికి వచ్చే సరికి నిందితులు పరారయ్యారు. బాధిత కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించింది. గాయాలతో ఉ న్న యువతిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయిరాంరెడ్డి, గౌస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ వార్డు కౌన్సిలర్ కుమారుడని తెలిసింది.