నగ్నంగా నిలబడితేనే నటనలో శిక్షణ ఇస్తారట !

బట్టలు విప్పితే నటన నేర్పుతానంటూ యువతుల్ని వేధిస్తున్న ఓ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అచింత కౌర్ చద్దా అనే యువతి ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.‘‘హిమాయత్ నగర్‌లో ఉన్న ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’కు వినయ్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ మధ్యే నాతో సహా మరో ఎనిమిది మంది విద్యార్థులు ఈ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకోవడానికి చేరారు. మాకు ఉదయం 6:30 నుంచి ఉదయం 9:30 వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 16న వినయ్ వర్మ ఆధ్వర్యంలో యాక్టింగ్ తరగతులు నడుస్తున్నాయి. ఇంతలో తలుపులు, కిటికీలు అన్ని మూయమని చెప్పి అనంతరం ఒక్కొక్కరిగా అందరినీ బట్టలు విప్పమని చెప్పారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను బట్టలు తీయనని మా సర్‌కు చెప్పాను. ఆయన నన్ను తిట్టి బయటికి వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ ఒక యువతి ఆయన చెప్పినట్టుగానే బట్టు విప్పింది. మిగతా యువకులు కూడా అలాగే చేశారు’’ అని చెప్పుకొచ్చింది. ఇనిస్టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన యువతి ‘షీ టీమ్’కు ఫిర్యాదు చేసింది. ఏసీపీ నర్మద, రామ్ లాల్ నుంచి మంచి వెంటనే స్పందన వచ్చిందని యువతి చెప్పింది. అయితే ఏసీపీ సూచన మేరకు నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదని వాపోయింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మద్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చిందని అచింత ఆవేదన వ్యక్తం చేసింది.నా జీవితంలో పోలీస్ స్టేషన్ రావడం ఇదే తొలిసారి. అయితే పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం నన్ను తీవ్ర వేధనకు గురిచేసింది. నిజానికి చాలా వరకు నేరాలు పోలీసుల అలక్ష్యం వల్లే జరుగుతున్నాయేమో. కానీ నేరస్థులపై పోలీసులు వెంటనే చర్యలు ఎందుకు తీసుకోరో నాకర్థం కాదు. నిజాయితీ గల వ్యక్తుల పట్ల స్పందించకపోవడం కూడా నేరానికి మార్గం సుగమం చేయడమే’’ అని అంకిత మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొంది.