గాంధీ ఆసుపత్రిలో ఓ మహిళ కిడ్నాప్ అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను కిడ్నాప్ చేసి నాలుగైదు రోజులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ నగరంలోని చిలకల గూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. తన బావ చికిత్స కోసం ఈ నెల 4వ తేదీన గాంధీలో చేరగా అక్కడ సిబ్బంది తనపై అత్యాచారం చేశారంటూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన అక్కను.. తనను గదిలో బంధించి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పెర్కొంది.
అయితే కిడ్నాపర్ల చెర నుంచి తాను తప్పించుకొని బయటపడ్డానని.. కానీ తన అక్క ఆచూకీ తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని పేర్కొంది. కొందరి సహాయంతో హైదరాబాద్ చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు మహిళ వెల్లడించింది. ఉమ మహేశ్వర్ అనే గాంధీ ల్యాబ్ టెక్నీషియన్ తనను అత్యాచారం చేశాడాని చిలకలగూడ పోలీసులకు చేసిన ఫిర్యాదులో మహిళ పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.