పెంబి మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ కుభీర్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి చేసుకోవాలని అడుగడంతో ముఖం చాటేశారు. ఆదివారం వెంకటేశ్ ఇంట్లో లక్ష్మి బైఠాయించి నిరసన తెలిపింది.
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని తెలిపాడని, అంతేకాకుండా శారీరకంగా లొంగదీసుకుని తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడని తెలిపింది.
మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని, రెండేళ్ల క్రితం కుభీర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని తెలిపింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు, దస్తురాబాద్ ఎస్సై జ్యోతిమయి ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని, ఇంట్లో చొరబడి బైఠాయించడం సరికాదని చెప్పి ఇంటికి పంపించారు.