కన్నతల్లే కూతురును రూ.50 వేలకు విక్రయించిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. రెంజల్ మండలానికి చెందిన ఓ మహిళపై గతేడాది అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటికే బాధిత మహిళ గర్భం దాల్చింది.
నెలకింద బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ బలహీనంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పాపను వదిలించుకోవాలనుకుని ఓ మహిళతో రూ.50 వేలకు పాపను విక్రయించింది. ఆ మహిళ పాపను మరొకరికి విక్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం పాప తల్లితో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు.