మహిళ ఆత్మహత్యాయత్నం

మహిళ ఆత్మహత్యాయత్నం

లైంగిక వేధింపులతో డెంఖనాల్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఓ మహిళ బుధవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలంగా మారిన ఈ ఘటనకు సంబంధిదంచి సదర్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోని బరేలికి చెందిన రస్మితా రౌత్‌ భర్త ప్రేమ్‌నాథ్‌ ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో పొట్టకూటి కోసం ఆమె రాష్ట్రానికి వలస వచ్చింది. కొద్ది నెలలుగా తన ఇద్దరు పిల్లలతో కొలిపంగి గ్రామంలో నివసిస్తోంది.

అయితే స్థానిక గ్రామస్తులు కొందరు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో జనవరి 24న భాపూర్‌ పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌లో ఫిర్యాదు చేసింది.పోలీసులు పట్టించుకోకపోవడం తోపాటు వేధింపులు అధికమయ్యాయి. దీంతో అభద్రతా భా వానికి గురైన రస్మితా.. తనకు న్యాయం చేయాలని డెంఖనాల్‌ కలెక్టరేట్‌ ఎదుట కిరోసిన్‌ పోసుకొని, నిప్పంటించు కోవడానికి ప్రయత్నించింది. పోలీసులు అడ్డుకోగా, గాజు ముక్కతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించింది. నిలువరించిన సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.