అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తొగుట ఎస్ఐ సామ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మన్నె భాస్కర్‌కు సిద్దిపేట మండలంలోని రంగధాంపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి (21)తో ఏడాది క్రితం వివాహమైంది. భాస్కర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.
తరచూ ఆ మహిళతో సెల్ఫోన్లో మాట్లాడేవాడు. తల్లి అండవ్వతో కలిసి వేధించేవాడు. వారి వేధింపులు భరించలేక ఆదివారం ఇంటిలో ఎలుకల మందు తీసుకొంది. చికిత్స కోసం ఆమెను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఐరేని నర్సయ్య ఫిర్యాదు మేరకు భాస్కర్, అండవ్వపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.