బిడ్డపుట్టేంత వరకు గర్బిణి అని తెలీదు.. తల్లికి బాత్రూం షాక్..

Newborn Baby

తెలంగాణలో ఓ వింత చోటుచేసుకుంది. తాజాగా ఓ మహిళ తాను గర్బిణి అని బిడ్డ పుట్టేంతవరకు తెలుసుకోలేకపోయింది. అసలు ఆమె నెలతప్పినట్లుగా బిడ్డ పుట్టేంతవరకు పసిగట్టలేకపోయింది. బాత్రూంకు వెళ్లి వృద్ధురాలు ప్రసవించేంతవరకు ఆమె తెలుసుకోలేకపోయింది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలో కోడె రాములమ్మ, రాముడు అనే దంపతులు ఉన్నారు. వీరికి 35 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు బిడ్డకు జన్మనివ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు.. ఆమెకు బిడ్డ పుట్టే వరకూ అసలు కనీసం తాను గర్భం దాల్చినట్లు కూడా తెలియకపోవడం సంచలనం రేపుతోంది. స్నానాల గదిలోకి వెళ్లినప్పుడు ఆకస్మాత్తుగా ప్రసవమై శిశువు జన్మించింది. బిడ్డ బరువు కేవలం 800 గ్రాములే కావడం విశేషం.

అసలు వివరాల్లోకి వెళ్తే… గత 22 ఏళ్ల క్రితం ఇక పిల్లలు వద్దనుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కూడా చేయించుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటూ.. కూలీ పనికి వెళ్తూ జీవనం సాగించారు. ఇలాగే ఇద్దరు ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి.. వారిద్దరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. వీరికి పెళ్లి చేసి దాదాపు మూడేళ్లు అయింది. ఈ మధ్య కొన్ని నెలలుగా రాములమ్మకు నెలసరి రాకపోతుండడం గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడే చికిత్స పొందింది. దీంతో స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం.. ఎప్పటివలెనే రాములమ్మ శుక్రవారం కూలీ పనులు చేసుకుని ఇంటికి వచ్చింది.

ఆ సాయంత్రం ఆమెకు కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆశా వర్కర్‌ దగ్గరకు వెళ్లింది. ఆమె ఇచ్చిన టాబ్లెట్‌ను వేసుకుంది. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో చేసేది లేక కాసేపటికి ఇంటికి చేరుకొని బాత్‌ రూంకి వెళ్లింది. లోపలే ఆడ శిశువు ప్రసవించింది. కనీసం గర్భం దాల్చినట్లు కూడా ఆమె గానీ.. కుటుంబ సభ్యులు గానీ గుర్తించ లేకపోవడం విశేషం. కాగా సుమారు 2.5 కేజీలు ఉండాల్సిన శిశువు 800 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో అసలు గర్భం ఉందని గుర్తించలేకపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు. శిశువు జన్మించిన విష

యం గుర్తించిన కుటుంబ సభ్యులు తొలుత ఆశ్చర్యానికి లోనే.. వైద్యం కోసం 108 వాహనంలో తొలుత అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత తల్లీ బిడ్డలిద్దర్నీ మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.