ఆ బీజేపీ నేత అపర కీచకుడు…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Women Files Rape Case Against BJP Leader Ravindra Bawanthade

Women Files Rape Case Against BJP Leader Ravindra Bawanthade

హస్తినలో జరిగిన కదిలే బస్సులో గ్యాంగ్ రేప్.. అధికారాన్ని తలకిందులు చేసింది. అప్పట్లో నిర్భయ పోరాటంలో బీజేపీ చురుగ్గా పాలు పంచుకోంది. ఇప్పుడదే కాషాయ పార్టీ నేతలు కదిలే బస్సులో ఓ మహిళను ముద్దుపెట్టుకోవడం కలకలం రేపుతోంది. అయితే ఈసారి ప్లేస్ మారింది. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీలో నిర్భయ ఘటన జరగ్గా.. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ దుర్ఘటన జరిగింది. బీజేపీ నేత సదరు మహిళను బలవంతం చేయబోగా.. ఆమె ఎలాగోలా తప్పించుకుంది.

బీజేపీ నేత చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రధాని మోడీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తలనొప్పిగా మారింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత రవీంద్ర బవన్లాడే పక్కన ప్రయాణికులున్నారన్న సంగతి కూడా మరిచిపోయి.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని సంఘ్ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని తేలినా.. ఇలాంటి పనుల కారణంగా బీజేపీ, కాంగ్రెస్ కు తేడా లేదని ఓటర్లు భావిస్తారనేది అంతా భయపడుతున్నారు.

మరోవైపు బాధితులురాలు బీజేపీ నేతపై రేప్ కేసు పెట్టింది. దీంతో ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. విషయమేమిటంటే రవీంద్రకు సదరు మహిళతో అంతకుముందే పరిచయం ఉంది. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి , పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇదో ప్రీ ప్లాన్డ్ రేప్ అటెంప్ట్ అని తేలడంతో.. బీజేపీ నేతలు మింగలేక..కక్కలేక మల్లగుల్లాలు పడుతున్నారు.

మరిన్ని వార్తలు:

రామ్ నాథ్ మనసు దోచిన కేసీఆర్

జీఎస్టీ అంటే విభజించు.. పాలించు